టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే అభిమానుల దృష్టి అంతా ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా పైనే ఉంది. ఎందుకంటే ఈ సినిమా డైరెక్ట్ చేస్తోంది కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్. దాంతోపాటు ఉర మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ప్రభాస్ నుండి పక్కా మాస్ మూవీ వచ్చి చాలా కాలమే అయింది. అందుకే ఫ్యాన్స్ అంతా సినిమా కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా సుమారు 85 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు ఇటీవల మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. 

అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుండి ఎటువంటి అప్డేట్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. అలాంటి ఫ్యాన్స్ కి మూవీ టీం అదిరిపోయే అప్డేట్ ను అందించింది. తాజా సమాచారం ప్రకారం మరో వారం రోజుల్లో సలార్ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇవ్వనున్నారట మేకర్స్. దీంతో ఆ అప్డేట్ ఏంటనే దానిపై ఇప్పుడు అభిమానులు సర్వత్ర ఆసక్తిని చూపిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అది సలార్ టీజర్ కు సంబంధించిన అప్డేట్ అని తెలుస్తుంది. మరో వారం రోజుల్లో సలార్ మూవీ నుంచి అదిరిపోయే టీజర్  రాబోతుందని టీ టౌన్ లో టాక్ వినిపిస్తోంది.

ఇందుకు సంబంధించి త్వరలోనే మూవీ టీం టీజర్ డేట్ అండ్ టైం ని ఫిక్స్ చేసి అఫీషియల్ గా ప్రకటించబోతున్నారట. ఈ అప్డేట్ తో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ అగ్ర హీరో పృథ్విరాజ్ సుకుమారన్, సీనియర్ హీరో జగపతిబాబు విలన్స్ గా కనిపించనున్నారు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రవి బసౄర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు ఆది పురుష్, ప్రాజెక్టు కే, స్పిరిట్, మారుతి సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఈ సినిమాల్లో ముందుగా ఆది పురుష జూన్ 16న విడుదల కానుంది. ఆ తర్వాత మూడు నెలలకే సలార్ సెప్టెంబర్ 28న థియేటర్స్ లో సందడి చేయనుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: