నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'డెవిల్'. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. బింబిసార తర్వాత కళ్యాణ్రామ్ కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. నిజానికి బింబిసారా మొదలవడానికి ముందే డెవిల్ మూవీ ని స్టార్ట్ చేశారు. కానీ మధ్యలో షూటింగ్ ఆపేశారు. కానీ ఈ సినిమా కథపై తనకు ఎంతో నమ్మకం ఉందని రావణాసుర ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చారు నిర్మాత అభిషేక్ నామ. అయితే తాజాగా డెవిల్ సినిమా కథ గురించి ఓ షాకింగ్ అప్డేట్ బయటికి వచ్చింది. అదేంటంటే.. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్గా కనిపిస్తారట. 

సినిమా కథలో మెయిన్ పాయింట్ సుభాష్ చంద్రబోస్ డెత్ లేదా అతని అదృశ్యానికి సంబంధించింది అని చెబుతున్నారు. 1945 బ్రిటిష్ కాలంలో జరిగిన నిజమైన సంఘటనల ఆధారంగా ఈ కథను రెడీ చేశారట. ఇందులో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ ఏజెంట్గా కనిపిస్తారని.. సినిమాలో అతను చేసే సాహసాలు ఆకట్టుకుంటాయని అంటున్నారు. సుభాష్ చంద్రబోస్ 1945 ఆగస్టు 18న మృతి చెందాడు. అయితే ఇప్పటికీ ఆయన ఎలా చనిపోయాడు? అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూ ఉండగా.. సుభాష్ చంద్రబోస్ అసలు చనిపోలేదనే వాదన కూడా ఉంది. నిజానికి సుభాష్ చంద్రబోస్ తైపేలో విమానం కూలడంతో చనిపోయాడని ప్రపంచం మొత్తానికి తెలుసు. అయితే ఇది నిజం కాదని చాలామంది చెబుతూ ఉంటారు.

అయితే అతని డెత్ వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏంటి అనే పాయింట్ని డెవిల్ సినిమాలో ప్రస్తావిస్తారట. సుమారు 75 ఏళ్లు గడిచినప్పటికీ నేతాజీ డెత్ ఇంకా మిస్టరీగానే మిగిలింది. ఇక 2005లో ఓ నివేదిక ప్రకారం సుభాష్ చంద్రబోస్ మరణించలేదని కన్ఫర్మ్ అయింది. కానీ సుభాష్ చంద్రబోస్ మనవళ్లు మాత్రం తమ తాత విమాన ప్రమాదంలోనే మృతి చెందారని చెప్పారు. కానీ చంద్రబోస్ మాత్రం ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ లో గున్నామి బాబాగా బ్రతికే ఉన్నారంటూ కొన్ని వార్తలు వచ్చాయి. దీనిపై బెంగాలీ లో ఓ సినిమా కూడా వచ్చింది. ఇక ఆ బెంగాలీ సినిమాను బేస్ చేసుకుని కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీ తెరకెక్కుతుందనే వాదన కూడా వినిపిస్తోంది. మొత్తం మీద నిర్మాత అభిషేక్ డెవిల్ మూవీ స్టోరీ పై ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అన్నట్టు డెవిల్ కి సీక్వెల్ కూడా ఉంటుందని ఇటీవల నిర్మాత స్వయంగా ప్రకటించారు ...!!

మరింత సమాచారం తెలుసుకోండి: