వెట్రిమారన్‌ గురించి తెలుగులో పెద్దగా తెలీకపోవచ్చు కానీ తమిళనాట మాత్రం ఈ పేరు ఓ సంచలనం. ఆయన సినిమా రిలీజ్ అవ్వబోతుందంటే చాలు.. అమాంతం అంచనాలు నింగికి పెరిగిపోతుంటాయి. స్టార్ల కంటే కూడా కథలకే పెద్దపీట వేస్తూ సినిమాలు తీయడం ఆయన స్టైల్. జాతీయ పురస్కారాల్లో ఆయన పేరు ఎక్కువగా వినిపిస్తుంటుంది. అంత ప్రభావవంతమైన సినిమాలు వెట్రిమారన్ చేస్తుంటారు. ఆయన తమిళంలో తీసిన అసురన్ సినిమా తెలుగులో నారప్పగా రీమేక్ అయ్యింది. ఆయన ఇటీవల తమిళంలో తీసిన సినిమా 'విడుదలై: పార్ట్‌1. హాస్య ప్రధానమైన పాత్రల్లో నటించే సూరి ఇందులో కథానాయకుడు కావడంతో అందరిలో కూడా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. అక్కడ ఇప్పటికే విడుదలైన ఈ సినిమా తెలుగులో 'విడుదల: పార్ట్‌1' గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా వుందో తెలుసుకుందాం.కుమరేశన్ (సూరి) అనే వ్యక్తి కొత్తగా ఉద్యోగంలో చేరిన ఓ పోలీస్ కానిస్టేబుల్‌. ప్రజాదళం నాయకుడైన పెరుమాళ్‌(విజయ్ సేతుపతి)ని పట్టుకునేందుకు పనిచేస్తున్న ప్రత్యేకమైన పోలీస్ దళంలో డ్రైవర్‌గా పని చేస్తాడు. దట్టమైన అడవిలో పనిచేస్తున్న పోలీస్ దళానికి రోజూ జీప్‌లో ఆహారం సరఫరా చేయడమే ఈ కుమరేశన్ పని. ప్రజలకి కష్టం వస్తే ఆదుకోవడమే పోలీస్ విధి అనేది ఇతను నమ్మిన సిద్ధాంతం.


అనుకోకుండా అడవిలో ఓ మహిళపై ఎలుగుబంటి దాడి చేయడంతో ఆమెని ఆస్పత్రిలో చేర్పించేందుకని పోలీస్ జీప్‌ని ఇతను వాడతాడు. దాంతో పై అధికారుల ఆగ్రహానికి హీరో గురవుతాడు.అందుకు క్షమాపణ చెప్పాల్సిందే అంటాడు అధికారి. కుమరేశన్ మాత్రం తప్పు చేయలేదు కాబట్టి అసలు క్షమాపణ చెప్పనంటాడు.ఇక మరోవైపు గాయపడిన ఆ మహిళ మనవరాలు పాప (భవానీ శ్రీ)తో కుమరేశన్ స్నేహం చేస్తాడు. అది వారి ప్రేమకి దారితీస్తుంది. ఒక పక్క ప్రేమ అలాగే ఇంకోవైపు పెరుమాళ్ కోసం సాగించే వేటలో  కుమరేశన్ ఎలాంటి సంఘర్షణకి గురవుతాడన్నది థియేటర్లో చూడాలి.1987 నేపథ్యంలో సాగే స్టోరీ ఇది. రైలు ప్రమాదంతో సినిమా ఆరంభమై దట్టమైన అడవుల్ని చూపించడం నుంచే దర్శకుడు విడుదల ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లాడు. ఇక బేస్ క్యాంప్ నుంచి హీరో కుమరేశన్ విధులు నిర్వర్తించే తీరు... ఆ క్రమంలో ఎదురయ్యే అనుభవాలు చాలా ఆసక్తిని రేకెత్తిస్తాయి. అడవుల్లో జీవితాల్ని అత్యంత సహజంగా తెరపైకి తీసుకొచ్చాడు వెట్రి.సూరి, విజయ్ సేతుపతి ఇంకా గౌతమ్ మేనన్ చుట్టూ సాగే పతాక సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి. వాటితోనే విడుదల పార్ట్‌-2పై ఆసక్తిని పెంచారు.మొత్తానికి సినిమా చాలా బాగుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: