మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా అడుగుపెట్టి  తనకంటూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు పొందారు.ఇలా సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన మరోవైపు బిజినెస్ రంగంలో కూడా బాగా దూసుకుపోతున్నారు.ఇలా రామ్ చరణ్ ఇప్పటికే పలు బిజినెస్లను నిర్వహిస్తూ వాటిని ఎంతో విజయవంతంగా నడిపిస్తున్నారట.

అయితే తాజాగా ఈయన తన బిజినెస్ లో మరో మెట్టు పైకి ఎక్కినట్టు సమాచారం.ఈ క్రమంలోనే రామ్ చరణ్ ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారడంతో మెగా ఫ్యాన్స్ బాగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈయన ఐపిఎల్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు అంటే మ్యాచ్ ఆడటం కోసం అయితే కాదు. ఐపీఎల్ టీమ్ కొనుగోలు చేయడానికి మెగా పవర్ స్టార్ సిద్ధమయ్యారని సమాచారం.. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రెటీలు ఈ విధమైనటువంటి బిజినెస్ నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే రామ్ చరణ్ కూడా ఈ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టబోతున్నారని సమాచారం.. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ నుంచి రెప్రజెంట్ చేస్తూ ఒక్క ఐపీఎల్ టీమ్ కూడ లేదు. తెలంగాణలో సన్ రైజెస్ హైదరాబాద్ లా ఏపీలో కూడా ఒక టీమ్ ను ఐపీఎల్ లోకి తీసుకురావాలని రామ్ చరణ్  కూడా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.ఇందుకు సంబంధించి అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయని వచ్చే ఏడాది రామ్ చరణ్ ప్రాంచైజీ నుంచి ఒక కొత్త టీం ఐపీఎల్ లోకి అడుగు పెట్టబోతున్నారని సమాచారం.. ఇక ఈ టీంకు పేరు కూడా ఫిక్స్ చేశారని తెలుస్తుంది.. ఈ టీమ్ కి వైజాగ్ వారియర్స్ అనే పేరును కూడా పెట్టారని తెలుస్తోంది. ఇలా ఈ టీం ద్వారా రామ్ చరణ్ కూడా ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న నేపథ్యంలో ముందుకు వెళ్లారని సమాచారం.. అయితేఇందుకు సంబంధించి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినా ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. త్వరలోనే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: