సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇలా ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించిన మహేష్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే మహేష్ తన కెరియర్ లో నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ లలో భరత్ అనే నేను మూవీ ఒకటి. ఈ మూవీ కంటే ముందు మహేష్ వరుసగా బ్రహ్మోత్సవం ... స్పైడర్ మూవీ ల అపజయాలతో డీలపడిపోయి ఉన్నాడు. 

అలాంటి సమయంలో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన భరత్ అనే నేను మూవీ తో మహేష్ అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాలో కియార అద్వానీ ... మహేష్ హీరోయిన్ గా నటించగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.

దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా ఈ మూవీ విజయంలో కీలక పాత్రను పోషించింది. ప్రకాష్ రాజ్ ... రావు రమేష్మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా 2018 వ సంవత్సరం ఏప్రిల్ 20 వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదల అయిం ది. ఈ మూవీ ఈ రోజుతో 5 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ మూవీ ని డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య అత్యంత భారీ బడ్జెట్ తో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: