టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగులో అగ్రనటులలో ఒకడిగా రాణిస్తున్నాడు.త్వరలో ఎన్టీఆర్ పేరు గ్లోబల్ లెవెల్ లో చాలా ప్రభలంగా వినిపిస్తుందన్నది చాలామంది ట్రేడ్ పండితులు మాట. డైలాగ్ చెప్పినా, డ్యాన్స్ వేసినా ఇంకా ఫైట్ చేసినా.. జూనియర్ ఎన్టీఆర్‌కు సెపరేట్ మార్క్ ఉంటుంది. సినిమాల పరంగా ఇప్పుడు పీక్ స్టేజ్‌లో ఉన్నాడు ఎన్టీఆర్. ఇటీవల ఆర్.ఆర్.ఆర్ సినిమాతో అతడి నటనాస్థాయి ఏంటో ప్రపంచం మొత్తానికి కూడా తెలిసింది.ప్రస్తుతం కొరటాల శివ సినిమాలో నటిస్తున్నాడు ఎన్టీఆర్.ఇక జూనియర్ ఎన్టీఆర్ పర్సనల్ లైఫ్‌ కూడా చాలా సంతోషంగా సాగుతుంది. ఎంతో ప్రేమించే తల్లి ఇంకా కుటుంబం మొత్తాన్ని ఆప్యాయంగా చూసుకునే భార్య అలాగే ముద్దైన ఇద్దరు తనయులతో జూనియర్ ఎన్టీఆర్.. చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే కెరీర్ స్టార్టింగ్ టైంలో తారక్ కూడా కాస్త పక్కచూపులు చూశారు. ఆయన ఓ హీరోయన్‌ను బాగా ఇష్టపడ్డారు. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో కూడా అంగీకరించారు.


 అప్పట్లో గట్టిగానే ఆ విషయం గురించి పబ్లిసిటీ చేశారని.. అలా ఓ దగ్గర ఏదో ఇష్టం కలిగిందని.. ఆ తర్వాత ఇది కాదేమో అనిపించిందని జూనియర్ చెప్పాడు. తనకు 23 ఏళ్ల వయస్సులో అది జరిగిందని.. అది పాసింగ్ ఫేజ్ అని ఎన్టీఆర్ పేర్కొన్నాడు.దాని వల్ల తనకు ఎలాంటి సమస్య రాలేదని ఆయన చెప్పుకొచ్చారు. లైఫ్ లో తీసుకున్న ఏ నిర్ణయం పట్ల తాను బాధపడటం లేదని జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించాడు.ఏదైనా నిర్ణయం తీసుకునేముందు 100 రకాలుగా ఆలోచిస్తానని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు.ప్రొఫెషనల్ లైఫ్‌ను, పర్సనల్ లైఫ్‌ను తాను అస్సలు కలపనని జూనియర్ ఎన్టీఆర్ తెలిపాడు. తాను ఇంటర్ చదివే సమయంలో.. కొన్ని రకాల కోతి వేషాలు ఉండేవని అయితే అవి అందరి లైఫ్‌లో కామన్ అని అన్నారు తారక్.ఇంతకీ తారక్ ఇష్టపడి ప్రేమలో పడ్డ హీరోయిన్ ఎవరంటే ఆమె సమీరా రెడ్డి అని సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: