తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటు వంటి శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ఈ నటుడు ఆఖరుగా ప్రిన్స్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యవరేజ్ విజయం అందుకుంది. ఈ సినిమాకు జాతి రత్నాలు మూవీ కి దర్శకత్వం వహించినటు వంటి అనుదీప్ కే వీ దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఈ హీరో మా వీరన్ అనే తమిళ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ కి మడోన్న అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను తెలుగు లో మహా వీరుడు పేరుతో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ ని తమిళ్ మరియు తెలుగు భాషలో ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అదితి శంకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ లో సరిత , యోగి బాబు , మిస్కిన్ , సునీల్ తదితర నటులు ముఖ్యమైన పాత్రలలో నటిస్తున్నారు.

శాంతి టాక్స్ నిర్మించిన ఈ మూవీ కి భరత్ శంకర్ సంగీతం అందించారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకున్నట్లు ... అలాగే ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను జెమినీ సంస్థ దక్కించుకున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం ఫుల్ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: