డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కించిన పోన్నియన్ సెల్వన్ మొదటి భాగం గత ఏడాది విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అయితే కేవలం తమిళంలో మాత్రమే ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇతర భాషలలో పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. తాజాగా ఈ రోజున పోన్నియన్ సెల్వన్-2 చిత్రాన్ని విడుదల చేయడం జరిగింది. భారీ తారాగణంతో ఈ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ మణిరత్నం ప్రోమోతో ఇప్పటికే విడుదలైన పాటలతో బాగానే హైపును సంపాదించారు.


ప్రముఖ నవల పోన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించడం జరిగింది మణిరత్నం. అన్ని భాషలలో అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నది. ఇప్పుడు సెకండ్ పార్ట్ గురించి ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.. ఓవర్సీస్ లో ఈ సినిమా ఇప్పటికే ప్రీమియం షో మొదలైంది. ఈ చిత్ర విషయాలను రివ్యూ ను సోషల్ మీడియా రూపంలో పంచుకున్నారు అభిమానులు. కార్తీ జయం రవి,త్రిష ,ఐశ్వర్యారాయ్ ,శోభిత ధూళిపాళ్ల, ప్రకాష్ రాజ్ , విక్రమ్ శరత్ కుమార్ తదితరులు నటీనటులు సైతం నటించారు.



అయితే ఈ సినిమా చూసిన కొంతమంది నెటిజన్లు సైతం మొదటి భాగం కంటే రెండవ భాగంలో పలు ఆసక్తికరమైన విషయాలను జోడించారు. నటీనటుల ఎంపిక కూడా బాగానే ఉంది.. రహస్యం ముగింపుతో రెండవ భాగం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా బిజిఎం సపోర్ట్ కెమెరా వర్క్ తో పాటు ఓవరాల్ గా ఎటువంటి లాక్స్ లేకుండా ఈ సినిమా పరవాలేదు అనిపించుకుందంటూ కామెంట్లు చేస్తున్నారు.



మరి కొంతమంది ఈ చిత్రంలో నటీనటుల లుక్స్ ఎలివేషన్ అల్టిమేట్ ఈ సినిమా ఫ్రైడ్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది పోన్నియన్ సెల్వన్ చిత్రం పరిపూర్ణ దృశ్యాలతో చరిత్రను చూపించారు చాలా పాత్రలు బాగున్నాయి మణిరత్నం తెరపై ఊహలస్తాయి కలనిజం అయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: