కోలీవుడ్ లెజెండరీ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ పొన్నియిన్ సెల్వన్2. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 28 వ తేదీ శుక్రవారం రోజున ప్రేక్షకుల ముందుకి చాలా గ్రాండ్ గా వచ్చింది.బాహుబలి లాగే రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీ మొదటి భాగం PS1 గత సంవత్సరం రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ పార్ట్ దాదాపు 550 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి తమిళనాట బాహుబలిని బీట్ చేసి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. దీంతో సహజంగానే పార్ట్ 2పై కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్ కూడా సినిమాపై మిన్నంటి అంచనాలను పెంచేశాయి. ఇక భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య విడుదలైన పోనియన్ సెల్వన్ పార్ట్ 2 సినిమా ఎలా ఉంది? ఇంకా దానిపై ప్రేక్షకుల కామెంట్స్ ఎలా ఉన్నాయి? అనేది ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.


యూఎస్ ప్రీమియర్స్ ఇంకా మార్నింగ్ షోస్ నుండి వినిపిస్తున్న టాక్ ని బట్టి PS పార్ట్ వన్ తో పోలిస్తే పార్ట్ 2 సినిమా చాలా బాగుంది. PS పార్ట్ వన్ విషయంలో మూవీ చాలా లాగ్ ఉందనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి.దీంతో ఈసారి మాత్రం పార్ట్ 2లో ప్రేక్షకులకు ఆ ఫీలింగ్ కలగకుండా జాగ్రత్త పడ్డారు మేకర్స్. అయితే ఇదే సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్.ఇక నటీనటుల పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే.. పార్ట్ వన్ లో విక్రమ్ - ఐశ్వర్యరాయ్ కు అంతగా ప్రాధాన్యత లేదు. కానీ.. పార్ట్ 2 లో మాత్రం కథ మొత్తం కూడా అసలు వీళ్ల చుట్టే నడుస్తుంది. ఇక విక్రమ్ - ఐశ్వర్యరాయ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పాత్రల్లో వారు నటించారు అనడం కంటే జీవించడం కరెక్ట్. ఇక కార్తీ, జయం రవి, త్రిష కూడా తమ తమ పాత్రల్లో ఎంతగానో ఒదిగిపోయారు. ఇక మొత్తంగా.. పీఎస్2 మూవీ తమిళ జనాలకు సూపర్ గా నచ్చేస్తుంది . అయితే మిగతా భాష జనాలకు ఈ సినిమాకి ఎంతవరకు నచ్చుతుందో అనేది చూడాలి మరి.మొత్తానికి సినిమా అయితే సూపర్ గా వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: