టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ వెండి తెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా అడుగు పెట్టి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా టాలీవుడ్ లోనే కాదు ఏకంగా బాలీవుడ్ లో కూడా అభిమానులను సొంతం చేసుకున్నాడు.నేడు విజయ్ దేవరకొండ తన 34వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నాడు.ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో తన గతం గురించి మాట్లాడుతూ కేవలం రూ. 10 వేల సంపాదన కోసం ఎన్ని రకాలుగా కష్టపడ్డాడో గుర్తుచేసుకున్నాడు.శేఖర్ కమ్ముల తీసిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో వెండి తెరపై చిన్న క్యారెక్టర్ తో అడుగు పెట్టిన విజయ్ దేవరకొండ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో తన క్యారెక్టర్ తో పేరు తెచ్చుకున్నాడు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా అడుగుపెట్టి.. హీరోగా మొదటి హిట్ అందుకున్నాడు. ఈ మూవీ అయితే ఏకంగా నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ను అందుకుంది. ఇక 2017 వ సంవత్సరంలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కాసారిగా ఓవర్ నైట్ స్టార్ డమ్ ను సొంతం చేసుకున్నాడు. ఆ సినిమాలో తన నటనతో ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నాడు.


ఆ తరువాత రెండు వరస విజయాలతో టాలీవుడ్ లో యంగ్ హీరోగా స్టార్ హోదాను సొంతం చేసుకున్న విజయ్ దేవర కొండ సినిమాల్లో రాకముందు డబ్బుల కోసం చిన్న చిన్న పనులు కూడా చేశాడు. చిన్న చిన్న ప్రదర్శనలు కూడా ఇచ్చాడు.. పదివేల రూపాయల కోసం ఎంతో కష్టపడినట్లు గుర్తు చేశాడు విజయ్. ఇక అంతేకాదు ఇల్లు కొనుకోవాలనుకున్నప్పుడు.. ఒక మ్యూజిక్ ఆల్బమ్ లో కూడా నటించాడు. అవసరం తీరడం కోసం ఏ పని అయినా ఏ చిన్న క్యారెక్టర్ అయినా సరే ఒకే అని తనకు సరైన అవకాశం వచ్చే దాకా వేచి చూశాడు విజయ్ దేవర కొండ. అయితే ఇప్పుడు తనకు డబ్బు తనకు ఉత్తేజాన్ని ఇవ్వదని పేర్కొన్నాడు. ఎందుకంటే తాను చేస్తున్న పనికి తగిన పారితోషకంని ఇస్తున్నారు.ఇక తనకు తన అర్హత ఏమిటో తెలుసన్నాడు. అందుకనే తనకు డబ్బులు ఇస్తేనే ఏ పని అయిన చేస్తానని.. అదే సమయంలో తనకు నచ్చని పనిని ఎంత డబ్బులు ఇచ్చినా కూడా చేయనంటూ స్పష్టం చేశాడు అర్జున్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: