మాస్ మహారాజా రవితేజ ఆఖరుగా నటించిన 5 మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని కోట్ల కలక్షన్ లను సాధించాయో తెలుసుకుందాం.

రావణాసుర : రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అను ఇమ్మానుయేల్ , మేఘ ఆకాష్ , ద్రాక్ష నాగర్కర్ , పూజిత పాన్నొడ , ఫరియ అబ్దుల్లా ముఖ్య పాత్రల్లో నటించగా టాలీవుడ్ యువ హీరో సుశాంత్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించాడు. మంచి అంచనాలు నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఈ మూవీ ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 12.02 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది.

ధమాకా : రవితేజ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 45.06 కోట్ల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది.

రామారావు ఆన్ డ్యూటీ : రవితేజ హీరోగా రూపొందిన ఈ సినిమా ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 5.20 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

ఖిలాడి : రవితేజ హీరోగా డింపుల్ హయాతి , మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 13.70 కోట్ల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది.

క్రాక్ : రవితేజ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 39.16 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: