సూపర్ స్టార్ మహేష్ బాబు ఆఖరుగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన సర్కారు వారి పాట అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో కీర్తి సురేష్ ... మహేష్ సరసన హీరోయిన్ గా నటించగా ... థమన్మూవీ కి సంగీతం అందించాడు. సముద్ర ఖనిమూవీ లో విలన్ పాత్రలో నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇలా సర్కారు వారి పాట మూవీ తో మంచి విజయాన్ని అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ మహేష్ కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది.  ఇప్పటి వరకు ఈ సినిమాకు మూవీ మేకర్స్ టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ షూటింగ్ ను ఎస్ ఎస్ ఎం బి 28 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ బృందం పూర్తి చేస్తూ వస్తుంది. ఈ మూవీ లో మహేష్ సరసన పూజా హెగ్డే , శ్రీ లీల హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... ఈ మూవీ కి తమన్ సంగీతం అందిస్తున్నాడు. జయరామ్ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని త్రివిక్రమ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఈ సినిమాలో ఎమోషన్స్ కు ఎంత ప్రాధాన్యత ఉంటుందో యాక్షన్ సన్నివేశాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ నుండి ఫస్ట్ గ్లిమ్స్ వీడియోను ... అలాగే ఈ సినిమా టైటిల్ ను మే 31 వ తేదీన ఈ మూవీ మేకర్స్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ యూనిట్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: