సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ప్రస్తుత చిత్రం SSMB -28 ఈ చిత్రానికి కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే పెట్టారు. ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి టైటిల్ విషయంపై అధికారికంగా ప్రకటించలేదు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా ఈ ఆగస్టు లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామంటూ మాట ఇచ్చిన మేకర్స్ పోస్ట్ పోన్ చేసి వచ్చేయేడాది జనవరిలో విడుదల చేయబోతున్నట్లు తెలియజేయడం జరిగింది. దీంతో అభిమానులు కాస్త నిరాశ చెందారని చెప్పవచ్చు. దీంతో అభిమానులకు ఉత్సాహం తెప్పించే విధంగా ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్మెంట్ చేయబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.కృష్ణ పుట్టినరోజు మహేష్ సినిమాలకు సంబంధించి అప్డేట్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు అదే విషయం గురించి అభిమానులలో చర్చ మొదలయ్యింది. ఈనెల 31న కృష్ణ బర్తడే సందర్భంగా SSMB -28 సినిమా టైటిల్ ని రివిల్ చేయబోతున్నట్లు సమాచారం. సూపర్ స్టార్ కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమా రిలీజ్ చేయబోతున్న సందర్భంగా ఈ సినిమాతో పాటు బిగ్ స్క్రీన్ పైన SAMB -28 చిత్రానికి సంబంధించి టైటిల్ అనౌన్స్మెంట్ చేయబోతున్నారని సమాచారం. అయితే ఇదే గ్లింప్స్ రూపంలో అనౌన్స్మెంట్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.


ఇక ఈ సినిమా టైటిల్ గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ సినిమా కి ముందు నుంచి అమరావతికి అటు ఇటు అనే టైటిల్ గట్టిగా వినిపిస్తోంది.. గుంటూరు కారం.. ఊరిలో మొనగాడు పేర్లు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి వీటిలో ఏ టైటిల్ ఫిక్స్ అవుతుందో చూడాలి అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి విషయం తెలియాలి అంటే ఈ నెల 31 వరకు ఆగాల్సిందే. ముఖ్యంగా ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ట్వీట్ కి భారీ అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ చిత్రంలో పూజా హెగ్డే, శ్రీ లీల నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: