తన అపార్ట్ మెంట్ లో ఉంటున్న ఓ పోలీస్ తో గొడవ వల్ల హీరోయిన్ డింపుల్ టెన్షన్ లో ఉంది. ఇది కాదన్నట్లు ఆమె ఇంట్లోకి ఇద్దరు అపరిచితులు చెప్పపెట్టకుండా వచ్చేయడం హాట్ టాపిక్ అయింది.

హీరోయిన్ డింపుల్ హయాతి తెలుగులో పలు సినిమాలు చేసిన హీరోయిన్. రీసెంట్ గా ‘రామబాణం’తో వచ్చింది కానీ హిట్ కొట్టలేకపోయింది. నటిగా కంటే రీసెంట్ గా ఓ పోలీసుతో గొడవపడి వార్తల్లో నిలిచింది. పార్కింగ్ విషయమై జరిగిన ఈ గొడవ కాస్త ఇప్పటికీ తేలట్లేదు. ఒకరిపై ఒకరు విమర్శల చేసుకోవడం పెద్ద డిస్కషన్ కి కారణమైంది. సరిగ్గా ఇలాంటి టైంలో డింపుల్ ఉంటున్న ఇంట్లోకి ఓ కుర్రాడు, యువతి అక్రమంగా ప్రవేశించే ప్రయత్నం చేయడం కలకలం రేపింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

ఇక వివరాల్లోకి వెళ్తే.. విజయవాడకు చెందిన డింపుల్, ‘గల్ఫ్’ మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేష్’లో ఐటమ్ సాంగ్ చేసి ఆకట్టుకుంది. రవితేజ ‘ఖిలాడి’, గోపిచంద్ ‘రామబాణం’లో హీరోయిన్ గా చేసింది గానీ పెద్దగా కలిసి రాలేదు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఈమె నివసిస్తోంది. అదే అపార్ట్ మెంట్ లో ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కూడా ఉంటున్నారు. వీళ్లిద్దరి మధ్య పార్కింగ్ విషయమై వారం రోజుల క్రితం గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు కంప్లైంట్ చేసుకోవడం, మీడియా ఎంటర్ కావడంతో ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. ఈ గొడవతో ఆల్రెడీ టెన్షన్ పడుతున్న డింపుల్ ఇంట్లోకి ఇద్దరు అపరిచితులు వచ్చే ప్రయత్నం తాజాగా జరగడం హాట్ టాపిక్ గా మారింది.

గురువారం ఉదయం డింపుల్ ఇంట్లోకి వీళ్లిద్దరూ అనుమతి లేకుండా ప్రవేశించారు. పనిమనిషి ఎవరా అని ఆరా తీసేందుకు ప్రయత్నించారు. ఇంతలో డింపుల్ ఇంట్లోని పెంపుడు కుక్క వాళ్ల దగ్గరికి రావడంతో లిఫ్టులోకి వెళ్లిపోయారు. దీనిపై భయపడిన డింపుల్.. వెంటనే పోలీసులని సంప్రదించింది. వాళ్లు అక్కడికి చేరుకుని సదరు యువతీ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసులు విచారించగా.. తాము రాజమండ్రి నుంచి వచ్చామని, డింపుల్ ఫ్యాన్స్ అని చెప్పుకొచ్చారు. తాజా ఇన్సిడెంట్ తో ఆమెని కలవడానికి వచ్చామని అన్నారు. దీని గురించి డింపుల్ కు చెప్పగా.. వీళ్లని ఆమె వదిలేయమని చెప్పారు. కొప్పిశెట్టి సాయిబాబు, శ్రుతిగా వీళ్లని గుర్తించారు. పోలీసులు ఈ ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: