ఈ మధ్యకాలంలో విడుదలైన సినిమాలలో ఎక్కువగా చిన్న సినిమాలకే పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. అలా వచ్చిన చిత్రం మేము ఫేమస్ ఈ సినిమా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.సినిమా బాగుందని కామెంట్లు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ మూవీ అంత పాజిటివ్ టాకీ వచ్చిన చాలామంది నేటిజన్స్ హీరో కం డైరెక్టర్ సుమంత్ ప్రభాస్ ని మాత్రం సోషల్ మీడియాలో కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమా పైన డైరెక్టర్ రాజమౌళి స్పందిస్తూ ఈ సినిమా బాగుందంటూ కామెంట్లు చేయడంతో సుమంత్ పైన మరింత ప్రశంశాల వర్షం కురిపిస్తున్నారు.


చాలాకాలం తర్వాత థియేటర్లో ఒక మంచి సినిమాను చూసి ఎంజాయ్ చేశానని ఈ అబ్బాయి సుమంత్ కోసం ఈ సినిమా చూడొచ్చు అంటూ నటుడుగా డైరెక్టర్గా సుమంత్ కి మంచి భవిష్యత్తు ఉంది అన్ని పాత్రలు కూడా చాలా చక్కగా డిజైన్ చేశారు నటీనటులు కూడా చాలా సహజంగానే కనిపించారు. ముఖ్యంగా అంజి మామ క్యారెక్టర్ ఇందులో హైలెట్ గా ఉంది అంటూ యువతను ప్రోత్సహించాలి.. ధమ్ ధమ్ చేయకూడదు అంటూ రాజమౌళి ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.

సినిమా విడుదలకు ముందు మహేష్ బాబు కూడా తన ట్విట్టర్ల ఈ సినిమా గురించి ప్రస్తావించడం జరిగింది. మేము ఫేమస్ సినిమాను చూసాను చాలా అద్భుతంగా ఉందంటూ విచ్చేశారు హీరో డైరెక్టర్ నటీనటులు నటన కూడా అద్భుతంగా ఉందంటూ పొగిడేశారు. ఈ సినిమాకి విడుదలకు ముందే చాలామంది హీరోలతో ప్రమోట్ చేయించారు.. ఇక విడుదలైన తర్వాత హీరోలు డైరెక్టర్లు సైతం ఈ సినిమాని చూసి  పొగిడేస్తూ ఉండడంతో మరింత హైప్ వస్తోంది. మరి కొంతమంది మాత్రం ఈ సినిమా బాగుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.నెగిటివిటీ ఎలా ఉన్నప్పటికీ ఈ సినిమా హిట్టు టాక్ తో ప్రస్తుతం దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: