
దీన్‌రాజ్ కథ మరియు పరుచూరి బ్రదర్స్ స్క్రీన్ ప్లే, జయంత్ సి పరాన్జీ దర్శకత్వం సినిమాని సూపర్ హిట్టుగా అయితే చేసింది. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా అంజలా ఝవేరి నటించింది. సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు ఇప్పటి ఆడియన్స్ ని కూడా చాలా బాగా అలరిస్తాయి.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ కి ప్రేమ ను తెలిపేందుకు వెంకటేష్ లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ ఉపయోగించడం చూసి.. అప్పటి కుర్రకారు తమ ప్రేమని అలా తెలపడానికి ప్రయత్నాలు కూడా చేశారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ ముందుగా అనుకున్నది అంజలా ఝవేరిని కాదని సమాచారం.దర్శకుడు జయంత్ ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఐశ్వర్యారాయ్ ని అనుకున్నాడని తెలుస్తుంది.. పైగా జయంత్‌కు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారా ఐశ్వర్యతో ఆల్రెడీ పరిచయం కూడా ఉంది. ఇక ఆమెను ఈ సినిమాలోకి తీసుకుందామని చిత్ర నిర్మాతలతో చెప్పగా వాళ్ళు వద్దు అని అయితే చెప్పారట.
అప్పటికే ఐశ్వర్య నటించిన 3 సినిమాలు కూడా ప్లాప్ లుగా నిలిచాయి. దీంతో ఆమె ఫ్లాప్ హీరోయిన్ గా ముద్ర ను వేసుకుంది. ఆ సెంటిమెంట్ తో ఆమెను నిర్మాతలు కాదు అనడంతో ఆ ఆఫర్ అంజలా ఝవేరిని వరించిందని సమాచారం.అలా ఐశ్వర్య రాయ్ కి తెలుగులో ఓ హిట్ సినిమా మిస్ అయిందని చెప్పవచ్చు.. ఈ మూవీలోని సాంగ్స్ ఆల్ టైం చార్ట్ బస్టర్ అనే చెప్పవచ్చు.ఈ సినిమాలో 6 పాటలు ఉన్నాయి. అందులో 3 పాటలు మణిశర్మ మరో 3 పాటలు మహేష్ మహదేవన్ ఇచ్చారని సమాచారం.