ఈ సంవత్సరం ఇప్పటిదాకా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిన మొదటి సినిమా ఏదన్నా ఉంది అంటే ఆ సినిమా బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన 'పఠాన్' సినిమా అని చెప్పాలి.ఈ సినిమా కంటెంట్ పరంగా యావరేజ్ గా ఉన్నప్పటికీ షారుఖ్ ఖాన్ స్టార్ పవర్ అయితే ఈ చిత్రానికి చాలా బాగా వర్కువుట్ అయ్యి బాలీవుడ్ హిస్టరీ లోనే రికార్డు మూవీగా అయితే నిలిపింది.ఇక ఈ సినిమా 1000 కోట్లకి పైగా భారీ వసూళ్లు అందుకోగా ఈ వసూళ్ళలో సగానికి పైగా ఓవర్సీస్ మార్కెట్ నుంచే వచ్చాయి. మరి ఈ సినిమా ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్ లో మరో రికార్డు రిలీజ్ కి రెడీ అయ్యినట్టుగా తెలుస్తుంది. కాగా ఈ సినిమా రష్యా సంయుక్త కామన్వెల్త్ దేశాల్లో ఏకంగా మూడు వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుందట.దీనితో ఈ సినిమా ఇండియా నుంచి మొదటి బిగ్గెస్ట్ ఎవర్ రిలీజ్ గా రికార్డు సెట్ చేసినట్టుగా సమాచారం తెలుస్తుంది.


మరి రష్యా కూడా ఈ సినిమాకి బిగ్ నంబర్స్ సెట్ చేస్తుంది అని ట్రేడ్ అంటున్నారు. ఇక అక్కడ ఈ సినిమాకి వచ్చే వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి.ఇక ఈ సినిమాలో మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సాలిడ్ క్యామియో లో నటించగా హాట్ బ్యూటీ దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించింది. ఇంకా అలాగే జాన్ అబ్రహం విలన్ గా నటించగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. భారీ బడ్జెట్ తో యష్ రాజ్ ఫిల్మ్స్ వారు ఈ సినిమాని నిర్మించారు.ఈ సినిమా బాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే హిందీలో రికార్డ్ వసూళ్లు సాధించిన ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వసూళ్లలో మాత్రం ఈ సినిమా టాప్ 4 లో కూడా లేదు. ఒకవేళ రష్యాన్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు చేస్తే ఈ సినిమా ఖచ్చితంగా ముందంజలో ఉండవచ్చు. మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి వసూళ్ళని నమోదు చేస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: