ఈ ప్రపంచంలో డబ్బు అవసరం లేనిది ఎవరికి. బిడ్డ కడుపులో పడినప్పటి నుండి  పుట్టి ,పెరిగి , పెద్దవాడై, ముసలివాడు అయ్యాక చనిపోయి, ఆ తరువాత కూడా శవాన్ని పూడ్చి పెట్టడం కోసం కూడా డబ్బు అవసరం అవుతుంది. అలా  ప్రతి ఒక్కరికి ప్రతి చిన్న పనికి డబ్బు అనేది చాలా అవసరం.  డబ్బు సంపాదించడం కోసం ప్రతి ఒక్కరు పలురకాల పనులు చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తుంటారు. ఇలా సంపాదించిన డబ్బును వృధా చేయకుండా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సరికొత్త స్కీం లలో కూడా జమ చేస్తూ పెద్దమొత్తంలో రాబడిని పొందుతున్నారు.


అయితే ఎవరైతే అతి తక్కువ కాలంలో ఎక్కువ రాబడిని పొందాలని ఆశిస్తున్నారో, అలాంటి వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పోస్టాఫీసులు కూడా కొన్ని ప్రత్యేకమైన స్కీమ్ లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. అందులో ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెట్టిన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీం  యొక్క కాలపరిమితి 15 సంవత్సరాలు. మీరు కావాలనుకుంటే మరో ఐదు సంవత్సరాల చొప్పున అలా పొడిగించుకుంటూ పోవచ్చు. అంతే కాదు ఇందులో 7.1 శాతం వడ్డీ కూడా లభిస్తుంది.

అయితే ఇందులో ప్రతి నెలా ఎంత ఆదా చేయాలంటే కేవలం మీరు ప్రతి రోజూ 100 రూపాయలు చొప్పున ఇన్వెస్ట్ చేయవచ్చు లేదా  నెలకు రూ.3000 చొప్పున ఇన్వెస్ట్ చేయాలి.  ఇక ఈ స్కీం యొక్క కాలవ్యవధి 15 సంవత్సరాలు కాబట్టి  వడ్డీతో కలిపి రూ. 10 లక్షల రూపాయలు మీ చేతికి వస్తాయి. ఒక వ్యక్తి కేవలం ఒక పీపీఎఫ్ ఖాతా తెరవడానికి మాత్రమే  వీలు ఉంటుంది. వడ్డీని ప్రతి మూడు నెలలకొకసారి కేంద్రం సవరిస్తుంది అన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ డబ్బులను అకౌంట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: