స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కథలకు సరికొత్త ప్రయోజనాలను అందించడానికి ముందుకు వచ్చింది.. మీరు కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ కలిగి ఉన్నారా..? బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించే డెబిట్ కార్డును మీరు ఉపయోగిస్తున్నారా..? అయితే మీకు కూడా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఎలా వస్తుంది.. మీరు తీసుకొని డెబిట్ కార్డు టైపు పైన మీ ఇన్సూరెన్స్ ఆధారపడి ఉంటుంది.


అయితే ఎలాంటి డెబిట్ కార్డు పైన ఎంత ఇన్సూరెన్స్ లభిస్తుంది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ముఖ్యంగా ఎస్బీఐ డెబిట్ కార్డు ఉపయోగిస్తున్నవారికి మాత్రమే ఈ ఇన్స్యూరెన్స్ లభిస్తుంది.అంతేకాదు ఆ కార్డును పీఓఎస్, ఏటీఎం,  ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో కేవలం 90 రోజుల్లో వాడాలన్న నిబంధన కూడా వుంది.


ఇకపోతే ఇన్సూరెన్స్ అనేవి.. పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ .. నాన్ ఎయిర్..ఇలా రెండు రకాల ఇన్స్యూరెన్స్‌లు వుంటాయి.. అయితే ఏ కార్డు పైన ఎంత ఇన్స్యూరెన్స్ మనకు లభిస్తుందో ఇప్పుడు చూద్దాం.


ఎస్బిఐ గోల్డ్ :  ( మాస్టర్ కార్డ్ / వీసా) కార్డు అయితే ఇన్స్యూరెన్స్ కవర్ నాన్ ఎయిర్ (డెత్) రూ.2 లక్షలు, ఇక  పర్సనల్ ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ రూ.4 లక్షలు రూపాయలు లభిస్తాయి.

ఎస్బిఐ ప్లాటినమ్ : (మాస్టర్ కార్డ్ / వీసా) అయితే యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్ కవర్ నాన్ ఎయిర్ (డెత్) కింద  రూ.5 లక్షలు. పర్సనల్ ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ కింద రూ.10 లక్షలు లభిస్తాయి.

ఎస్బీఐ ప్రైడ్ : బిజినెస్ డెబిట్.. (మాస్టర్ కార్డ్ / వీసా)
ఇది ఇలా వుండగా పర్సనల్ యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్ కవర్ నాన్ ఎయిర్ (డెత్) రూ.2 లక్షలు,  అలానే  పర్సనల్ ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ (డెత్) రూ.4 లక్షలు పొందొచ్చు.

అయితే ఈ ఇన్సూరెన్స్ ప్రయోజనాలన్నీ వ్యక్తి మరణించిన తర్వాతే వర్తిస్తాయి అని గుర్తించుకోవాలి. ఇక ఎస్బిఐ అందిస్తున్న ఇలాంటి  ఇన్సూరెన్స్ ల వల్ల కుటుంబ పెద్ద చనిపోయినట్లు అయితే మిగతా వారికి ఆసరాగా ఈ డబ్బు లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: