చాలామంది డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నప్పటికీ పన్నులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు.. అయితే మీరు కూడా పన్ను మినహాయింపు లభించి, ఆకర్షణీయమైన రాబడి పొందాలని ఆలోచిస్తున్నారా.. ? ఇక మీకు ఒక స్కీమ్ అందుబాటులో ఉంది అని చెప్పవచ్చు. అదే పి పి ఎఫ్ స్కీమ్. ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ లో కాంపౌండెంట్, టాక్స్ రిటర్న్స్ వెసులుబాటును కూడా అందిస్తున్న కొన్ని సేవింగ్ స్కీమ్స్ లలో ఇది కూడా ఒకటి. చాలామంది ఈ పబ్లిక్ ప్రావిడెంట్ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ స్కీం ప్రభుత్వ హామీ కలిగిన ఒక చిన్న సేవింగ్స్ స్కీమ్ అని చెప్పవచ్చు. ఇందులో ఆకర్షణీయమైన రాబడి తో పాటు టాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అంతే కాదు ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏకంగా రూ. 1.5 లక్షల వరకు టాక్స్ మినహాయింపు లభిస్తుంది. అంతే కాదు ఈ పథకంలో డబ్బులు పెట్టడం వల్ల ఎటువంటి రిస్క్ కూడా ఉండదు అని నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ పథకంలో ఎంత ఆదా చేయాలి అనే విషయానికి వస్తే రోజుకు రూ.400 చొప్పున లేదా నెలకు 12,500 రూపాయల వరకు చెల్లించవచ్చు. లేదా సంవత్సరానికి 1.5 లక్షల రూపాయలు కట్టినా సరిపోతుంది. ప్రస్తుతం కేంద్రం నుంచి మనకు ఈ పథకంపై 7.1 వడ్డీ కూడా లభిస్తోంది ఇక మెచ్యూరిటీ కాలం విషయానికొస్తే 15 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.

సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపు బెనిఫిట్ ఈ పథకం ద్వారా పొందవచ్చు.. ఉదాహరణకు మీరు ఏడాదికి రూ. 1.5 లక్షలు ప్రకారం 15 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి లాభాలు కూడా అందుతాయి. ఇక మీరు ఐదు సంవత్సరాలకు ఒకసారి పొడిగించుకుంటూ 30 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తే మీ చేతికి 1.54 కోట్ల రూపాయలు వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకులకు వెళ్లి ఈ పథకం యొక్క పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

మరింత సమాచారం తెలుసుకోండి: