వృద్ధాప్యంలో పెన్షన్ వృద్ధులకు అనేక రకాలుగా ఆసరాగా ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ క్రమంలోనే పెన్షన్స్ స్కీం లో ముందు నుంచే డబ్బులు ఇన్వెస్ట్ చేసి వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇకపోతే ఎలాంటి పింఛన్ స్కీమ్స్ లో లేని వాళ్ళు బ్యాంకులు అందించే కొన్ని పథకాలలో డబ్బులు దాచుకుంటే ప్రతినెలా కొంత పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి పథకాలను అందిస్తోంది. ఎస్బిఐ యాన్యుటీ డిపాజిట్ స్కీం పేరుతో ఎస్బిఐ ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.


డిపాజిటర్లు ఒకేసారి డబ్బులు డిపాజిట్ చేస్తే ఈక్విటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ రూపంలో డబ్బులు డిపాజిటర్ల అకౌంట్లో ప్రతినెల జమవుతాయి.  ఇందులో కొంత అసలు.. కొంత వడ్డీ కూడా కలిపి వస్తుంది..  ముఖ్యంగా ఎస్బిఐ అందిస్తున్న యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ లో. 36 నెలలు , 60 నెలలు,  84 నెలలు , 12 నెలల కాలానికి డిపాజిట్ చేయవచ్చు. అయితే ఈ స్కీంలో గరిష్టంగా ఎంతైనా సరే మీరు జమ చేసుకునేందుకు వీలు కల్పించబడింది . మంత్లీ యాన్యుటీ కింద కనీసం 1000 రూపాయలు లభిస్తుంది.


జమ చేసే మొత్తం పై లభించే పెన్షన్ ఆధారపడి ఉంటుంది.  కస్టమర్లు ప్రత్యేక సందర్భాలలో మొత్తం బ్యాలెన్స్ లో 75% ఓవర్ డ్రాఫ్ట్ లేదా లోన్ పొందే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతం ఫిక్స్డ్ డిపాజిట్లకు 6.1% వడ్డీ లభిస్తూ ఉండగా..  సీనియర్ సిటిజన్ లకు 6.9% వడ్డీ లభిస్తుంది.  ముఖ్యంగా మీరు ఎంచుకునే కాలవ్యవధిని బట్టి రేటు కూడా మారుతూ ఉంటుంది. ఒకవేళ డిపాజిట్ చేసిన వ్యక్తి మరణిస్తే ఫ్రీ మెచ్యూర్ క్లోజర్ కి కూడా అనుమతి ఇస్తారు. ఇందులో డిపాజిట్ చేసిన తర్వాత ఇతర బ్రాంచ్ లకు అకౌంటు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కష్టమర్లకు యూనివర్సల్ పాస్ బుక్ జారీ చేస్తారు. అయితే ఎన్ఆర్ఓ, ఎన్ఆర్ఈ కస్టమర్లు ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి సాధ్యపడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: