ఇటీవల కాలంలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆర్థికంగా డబ్బు సంపాదించాలనుకునేవారు ఎక్కువగా తపాలా శాఖ మీదే ఆధారపడుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ప్రమాద బీమా పట్ల ప్రజలలో అవగాహన పెరిగిన నేపథ్యంలో జీవిత బీమా,  ఆరోగ్య భీమా తరహాలో ప్రమాద బీమా కూడా తీసుకునే వారి సంఖ్య బాగా ఎక్కువ అవుతోంది.  ఇతర సంస్థల తరహా లోనే పోస్ట్ ఆఫీస్ కూడా ప్రమాద బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.. టాటా ఏఐజి తో కలిసి దీనిని ప్రారంభించింది తపాల శాఖ..

గ్రూప్ యాక్సిడెంట్ కార్డు పేరిట పోస్ట్ ఆఫీస్ ఖాతాదారుల కోసం ప్రమాద బీమా పాలసీని తీసుకురావడం జరిగింది. ఈ స్కీం తీసుకున్న వారు ఏడాదికి కేవలం రూ.399 చెల్లిస్తే సరిపోతుంది.. రూ.10 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కూడా పొందవచ్చు అంటే ఒక రోజుకు కేవలం రూపాయి కంటే కొంచెం ఎక్కువ ఖర్చుతో ఈ భారీ ప్రమాద బీమా కవరేజీని మీరు పొందే అవకాశం ఉంటుంది . తద్వారా మీ మీద ఆధారపడిన వాళ్లకు ఆర్థిక భరోసా ఇచ్చే అవకాశం ఉంటుంది.

18 నుంచి 65 సంవత్సరాల వయసు కలిగిన ఎవరైనా సరే భీమా పాలసీ తీసుకునే అవకాశం ఉంటుంది ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు ద్వారా మాత్రమే మీరు ప్రీమియం అనేది చెల్లించాలి. ఈ బీమా తీసుకోవాలి అంటే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు లో ఖచ్చితంగా ఖాతా ఉండాలి.  ఒకవేళ ప్రమాదంలో మరణించిన శాశ్వత వైకల్యం ఏర్పడిన లేదా ఏదైనా అవయవం కోల్పోయిన పక్షవాతం వచ్చిన కూడా 10 లక్షల రూపాయలు తపాలా శాఖ మీకు చెల్లిస్తారు.. పాలసీ తీసుకున్న వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగి వైద్యం కోసం ఆస్పత్రిలో చేరినప్పుడు ఇన్ పేషెంట్ డిపార్ట్మెంట్ కింద 60000 చెల్లించే అవకాశం ఉంటుంది. ఈ పథకం ద్వారా మీరు మరిన్ని ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: