రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఐదవ సారి సముద్రంలో వేటకు వెళ్లే 1,23,519 మత్స్యకార కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి రూ.10 వేల చొప్పున రూ.123.52 కోట్ల వరకు ఆర్థిక సహాయం అందించినట్లు ఏపీ సర్కార్ ప్రకటించింది ఇకపోతే ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 మధ్యకాలంలో ఆ మత్స్యకారుల కుటుంబాలకు ఎటువంటి ఇబ్బందులు కలక్కుండా ఇలా ఒక్కొక్క కుటుంబానికి పదివేల రూపాయలను జమ చేస్తూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఐదవ విడత కింద మరో 10 వేల రూపాయలను వారి ఖాతాల్లోకి జమ చేయాలనుంది.

దీంతోపాటు ఓఎన్జిసి సంస్థ పైప్లైన్ పనుల కారణంగా ఉపాధి కోల్పోయిన చాలామందికి కోనసీన, కాకినాడ జిల్లాలోని 23,458 మత్స్యకార కుటుంబాలకు అందిస్తున్న దాదాపు రూ.108 కోట్ల ఆర్థిక సహాయంతో కలిపి మొత్తం రూ.231 కోట్లను నేడు బాపట్ల జిల్లాలోని నిజాంపట్నంలో సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి మరి లబ్ధిదారుల ఖాతాలో డబ్బు జమ చేయబోతున్నారు. ఇకపోతే తాజాగా అందిస్తున్న ఈ ఆర్థిక సహాయంతో కలిపి వైయస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటివరకు ఒక్క వైయస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద మాత్రమే అందించిన సహాయం విలువ 538 కోట్ల రూపాయలు.

పదివేల చొప్పున ప్రతి ఏటా ఒక్కొక్క కుటుంబానికి ఈ పథకం ద్వారా సుమారుగా 50వేల రూపాయల లబ్ది చేకూరింది. అంతేకాదు సముద్రం పై వేటకు వెళ్లే మత్స్యకారుల స్థితిగతులను మెరుగుపరిచి వలసలను నివారించే లక్ష్యం దిశగా రూ.3,767.48 కోట్ల వ్యయంతో ప్రపంచ స్థాయి ప్రణాళికలతో కూడిన పది ఫిషింగ్ హార్బర్లు , ఆరు ఫిష్ లాండింగ్ కేంద్రాల నిర్మాణానికి జగన్ సర్కార్ శ్రీకారం చుట్టింది. అంతేకాదు మత్స్య ఎగుమతులకు మరింత ఊతం ఇస్తూ నాలుగేళ్లలోనే సుమారుగా రూ. 16 వేల కోట్ల ఖర్చుతో నాలుగు ఫోర్ట్ ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని స్పష్టం చేసింది మొత్తానికి అయితే జగన్ ప్రభుత్వం కారణంగా మత్స్యకారులు బాగా లాభపడుతున్నారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: