ప్రస్తుత కాలంలో చాలామంది డబ్బు దాచుకునే భాగంలోనే ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలలో ఎక్కువగా పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే పొదుపుతో పాటు పన్ను ఆదా ప్రయోజనాలను కూడా పొందాలనుకుంటున్నట్లయితే మీరు పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్ పథకంలో మీ డబ్బులను పెట్టుబడిగా పెట్టవచ్చు. ఇకపోతే ఈ పథకాల కింద మీరు ఆదాయపు పన్ను సెక్షన్ 80c కింద రూ .1.5లక్షల వరకు పన్ను మినహాయింపును పొందుతారు. అంతేకాదు ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు పన్ను ఆధా చేసే ఫిక్స్డ్ డిపాజిట్లుగా చలామణి అవుతాయి. ఇకపోతే పన్ను ఆధా చేసే ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలపై అధిక వడ్డీరేట్లు అందిస్తున్న బ్యాంకుల గురించి ఇప్పుడు చూద్దాం.

యస్ బ్యాంక్:
ఈ బ్యాంకు లో పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్ పథకంలో పెట్టుబడి పెట్టడానికి సాధారణ పౌరులకు 60 నెలలు అంటే ఐదు సంవత్సరాల ఫిక్స్ డిపాజిట్ పై 7.25% వడ్డీ రేటు అందిస్తూ ఉండగాm. ఇదే సమయానికి సీనియర్ సిటిజన్లకు 8 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇక్కడ పన్ను ఆదా కూడా ఉంటుంది.

డి సి బి బ్యాంక్:
ఈ బ్యాంకు తన కస్టమర్లకు 7.40% వడ్డీ రేటు తో ఐదు సంవత్సరాల పన్ను ఆదా పిక్స్డ్ డిపాజిట్ ను  కస్టమర్లకు అందిస్తోంది. ఇక ఇదే ఐదు సంవత్సరాల కాలంలో సీనియర్ సిటిజన్ లకు 7.9% వడ్డీని అందిస్తోంది.

ఇండస్ ఇండ్ బ్యాంక్:
ఈ బ్యాంకు ఐదు సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్ పథకంపై 7.25% వడ్డీ రేటును అందిస్తూ ఉండగా.. సీనియర్ సిటిజన్లకు కూడా 7.25% వడ్డీని అందిస్తోంది.

హెచ్డిఎఫ్సి బ్యాంక్:
ఐదు సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్ పథకంపై సామాన్య పౌరులకు 7 శాతం, సీనియర్ సిటిజనులకు 7.50 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ బ్యాంక్ లలో అమలులో ఉన్న ఈ పథకం లో  మీరు పెట్టుబడి పెట్టడం వల్ల అధిక వడ్డీ రేటు తో పాటు పన్ను మినహాయింపు కూడా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: