
నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీం..
నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ అనేది మహిళలకు ఉత్తమమైన ఎంపిక అని చెప్పవచ్చు. ఇందులో రూ.1000 నుంచి గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. అంతేకాదు ఈ పథకం ఐదు సంవత్సరాల కాల పరిమితి అయితే ఇందులో డిపాజిట్ ల పై 7.7% వడ్డీ కూడా లభిస్తుంది.
మహిళా సమ్మాన్ సముఖి పథకం:
మహిళా సమ్మాన్ సముఖి పథకం అనేది కేంద్ర ప్రభుత్వం.. మహిళల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన పథకం. ఇందులో మహిళలు రూ .2లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. ఇక రెండు సంవత్సరాల కాల వ్యవధి ఉన్న ఈ పథకంపై 7.5% వడ్డీ కూడా లభిస్తుంది.
టైం డిపాజిట్ పథకం:
పోస్ట్ ఆఫీస్ మహిళల కోసం అందిస్తున్న మరొక పథకం టైం డిపాజిట్ పథకం.. ఇందులో ప్రతినెల నిర్ణీత మొత్తంలో మీరు మీ ఖాతాలో జమ చేయవచ్చు. ఇలా ఐదు సంవత్సరాల పాటు ఉండే ఈ పథకంలో పోస్ట్ ఆఫీస్ 7.5% వడ్డీని అందిస్తోంది. ముఖ్యంగా ఈ పథకం మహిళలకు ఒక అద్భుతమైన ఉత్తమమైన ఎంపిక అని చెప్పవచ్చు.
సుకన్య సమృద్ధి యోజన పథకం:
ఈ పథకం ప్రత్యేకించి బాలికల కోసం ప్రారంభించబడింది. ఈ పథకం కింద తల్లిదండ్రులు తమ కుమార్తె పేరుమీద 10సంవత్సరాల వయసు వరకు ఖాతా తెరిచే అవకాశం ఉంటుంది. ఇందులో కనిష్టంగా రూ.250 నుంచి గరిష్టంగా రూ .1.5లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంపై 8శాతం వడ్డీ కూడా లభిస్తోంది.