ఒకప్పుడు ఆడపిల్ల పుట్టిందంటే చాలు చాలా మంది ఇబ్బంది పడేవారు.. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో పూర్తిగా మారిపోయాయి.. మగ ఆడ అని తేడా లేకుండా ఎవరైనా ఒక్కటే అనుకుంటున్నారు.. ముఖ్యంగా అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు కట్నం కచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితి మారింది.. చట్టం ప్రకారం కట్నం తీసుకోవడం నేరమైనప్పటికీ కూడా ఇప్పటికీ ఆ పద్ధతి ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వాలు సైతం ఆడపిల్ల పుట్టగానే వారు పొదుపు చేయడాన్ని మొదలుపెట్టే విధంగా పలు రకాల పథకాలను సైతం తీసుకువచ్చాయి.

చిన్న చిన్న మొత్తంలో పొదుపు చేసే వారికి సుకన్య సమృద్ధి యోజన పథకం మంచి లాభదాయకంగా ఉంటుంది. ఈ పథకం కేవలం ఆడపిల్లల కోసమే ప్రవేశపెట్టారు. పదేళ్లలోపు ఉన్నవారు ఈ పథకంలో ఎవరైనా సరే చేరవచ్చు.. లేకపోతే పాప పుట్టినప్పటినుంచి ఈ పథకంలో చేరవచ్చు. అయితే ఆధార్ కార్డు కచ్చితంగా ఉండాల్సిందే. కనిష్టంగా రూ.250 నుంచి గరిష్టంగా రూ .1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు.. అయితే ఈ సుకన్య సమృద్ధి పథకంలో చేరిన తర్వాత 15 సంవత్సరాలు పొదుపు చేయవలసి ఉంటుందట.

ఈ పథకంలో వడ్డీ 8.2 శాతం వరకు కొనసాగుతుంది ఇది ప్రభుత్వ పథకం ఇందులో కచ్చితంగా రాబడి మాత్రం ఉంటుంది. పాపకు 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత.. మీరు పొదుపు చేసిన మొత్తంలో సగం విత్డ్రా చేసుకొని అవకాశం ఉంటుందట.. వీటిని ఒకేసారి అయినా తీసుకోవచ్చు లేకపోతే వాయిదాలలో కూడా తీసుకోవచ్చట. ప్రతి ఏడాది మీరు..1.50 లక్షల పొదుపు చేస్తే చాలు 15 సంవత్సరాలకు..22,50,000 లక్షలు అవుతుంది మధ్యలో విత్డ్రా చేసుకుంటే 46,77,578 రూపాయలు వస్తుంది ఒకవేళ మొత్తం పథకం పూర్తి అయ్యేసరికి 69,27,578 రూపాయలు వస్తుందట. అయితే వీటికి పన్ను మినహాయింపు కూడా ఉంటుందట. ఏడాది పెట్టుబడి పెడితే..2045 పాప మెచ్యూరిటీకి ఈ డబ్బు మొత్తం వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: