ప్రస్తుతం ఉన్న రోజులలో సంపాదన కంటే చాలామందికి ఖర్చులు ఎక్కువగా అవుతూ ఉంటాయి.. పెరిగిన నిత్యవసర ధరలు ,ఇంటి ఖర్చులు ప్రస్తుతం చాలా విపరీతంగా పెరిగిపోయాయి. ఖర్చులకు తగ్గట్టుగా ఆదాయం పెంచుకునేందుకు కొంతమంది ఉద్యోగులు పార్ట్ టైమ్ జాబులు కూడా చేస్తూ ఉన్నారు.. అయితే ఇలాంటి వారి కోసమే ప్రతినెల కాసులు అందించే ప్రభుత్వ పథకాలు కూడా అందుబాటులో ఉంటున్నాయి.. ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ కేంద్ర ప్రభుత్వం పథకాలలో పెట్టుబడి పెడితే చాలు నెలకు పదివేల రూపాయల వరకు తమ అకౌంట్లో జమ అవుతూ ఉంటుంది.


ఆ పధకమే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్.. ఇందులో పెట్టుబడి పైన అధిక వడ్డీని కూడా అందిస్తూ మంచి రాబడిలను అందించే విధంగా ఉంటుంది. బ్యాంకులలో వడ్డీ రేట్ల కంటే పోస్ట్ ఆఫీస్ లో కాస్త ఎక్కువగానే వస్తూ ఉంటుంది. ఎవరైనా పోస్ట్ ఆఫీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటే వారికి ఇది చక్కటి అవకాశం.. ఎవరైనా ప్రతి నెల రాబడి వచ్చేలా ప్లాన్ చేయాలనుకుంటే ఈ స్కీం బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు.. ఈ పథకంలో డిపాజిట్ చేసిన డబ్బుకు ప్రతి నెల..7.4 శాతం వడ్డీ జమ అవుతూ ఉంటుంది దీనిని డ్రా చేసుకోవచ్చు.


అయితే ఈ వడ్డీ రేటు అనేది మూడు నెలలకు ఒకసారి మారుతూ ఉంటుందట. ఎవరైనా పోస్ట్ ఆఫీస్ పథకంలో చేరాలి అనుకుంటే దగ్గరలో ఉండి పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి ఈ పథకం గురించి అడగవచ్చు.. డిపాజిట్ చేసిన నెల తర్వాత నుంచి మెచ్యూరిటీ పూర్తి అయ్యేవరకు ప్రతి నెల మీరు పోస్ట్ ఆఫీస్ సేవింగ్ ఖాతాలో వడ్డీ రూపంలో సైతం తీసుకోవచ్చు.. అయితే ఈ స్కీమ్ లో కనీసం వెయ్యి రూపాయల నుంచి గరిష్టంగా తొమ్మిది లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు.. జాయింట్ అకౌంట్ అయితే 15 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు.. 9 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే నెలకు.. రూ.5,500 రూపాయలు పొందవచ్చు.. 15 లక్షలు చేస్తే 10,000 వరకు తీసుకోవచ్చు. మెచ్యూరిటీ సమయం పూర్తయిన తర్వాత పెట్టిన పెట్టుబడి కూడా మొత్తం తీసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: