రైతులు పంటలు పండించాలంటే ముఖ్యంగా ఎరువుల ధరలు చూసి చాలా మంది పంటలు వేయడాన్ని మానేస్తున్నారు.. ఇలాంటి సమయంలో పంజాబ్ హర్యానా సరిహద్దు ప్రాంతాలలో ఉండే రైతులు తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ పలు రకాల పోరాటాలు చేస్తూ ఉన్నారు.. ఎన్నికల ముందు ప్రభుత్వం రైతుల కోసం ఒక పెద్ద ప్రకటనను కూడా విడుదల చేసింది.. ఖరీఫ్ నాట్ల సందర్భంగా రైతులకు ఎరువులపైన ప్రభుత్వం భారీగానే సబ్సిడీని ఇస్తున్నట్లు ప్రకటించారు.. ఇందుకోసం రూ.24,420 కోట్ల రూపాయలను నిన్నటి రోజున మంత్రివర్గ సమావేశంలో ఆమోదం పొందేలా చేశారు.


ప్రధాన మోడీ అధ్యక్షతన జరిగిన ఈ క్యాబినెట్.. ఖరీఫ్ పంటకు అవసరమయ్యే పాస్పెట్, పొటాష్.. ఇతరత్న ఎరువుల పైన మొత్తం 24,420 కోట్ల రూపాయల సబ్సిడీని సైతం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ సమయంలోనే రైతులు ఉపయోగించే ప్రధాన ఎరువులైన డిఏపి క్వింటాకు రూ.1350 రూపాయలకి అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం తెలియజేస్తుంది.. ఏప్రిల్ ఒకటి నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ ఎరువుల పైన సబ్సిడీ అందుబాటులో ఉంటుంది అంటూ వెల్లడించారు. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పైన ప్రశంసలు కురిపిస్తున్నారు..


మీడియాతో మాట్లాడుతూ రానున్న ఖరీఫ్ పంటకు నత్రజని కిలో రూ.47.02.. పాస్ పెట్ కిలో రూ.28.72.. పోటాస్ కిలో రూ2.38.. సల్ఫర్ పై సబ్సిడీ కిలో రూ.1.89 ఉండే విధంగా నిర్ణయించారు.... పొటాష్ ఒక్కో బ్యాగు రూ.1,670 ఉండబోతోందని NPK రూ.1,470 రూపాయలకి అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. డిఏపి పై ఎగుమతి దిగుమతి ఆధారపడడానికి తగ్గించేందుకే ఈ పథకం కింద మూడు కొత్త ఎరువులకు రేట్లను సైతం కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్లో ఆమోదం తెలియజేసినట్లు తెలిపింది.. ఎరువుల కంపెనీలు కూడా నిర్ణీత ధరలకే ఇవ్వాలంటూ సూచిస్తున్నారు. దీంతో రైతులకు గిట్టుబాటు ధర లభించే విధంగా కూడా చూస్తామంటూ తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: