ప్రస్తుత కాలంలో చాలామంది యువత ఉద్యోగ ఒత్తిడిని తట్టుకోలేక వ్యవసాయం వైపుగా అడుగులు వేస్తున్నారు దీంతో చాలామంది యువత పెద్ద ఎత్తున కూడా భారీగానే సంపాదిస్తున్నారు.. డ్రాగన్ ఫ్రూట్, ఖర్జూరం, ఇతరత్రా పంటలు పండిస్తూ బాగానే సంపాదిస్తున్నారు. అయితే ఇందులో భాగంగా మార్కెట్లో కుంకుమ పువ్వుకు కూడా మంచి డిమాండ్ ఉన్నది. ఈ కుంకుమ పువ్వు ని వ్యాపారంగా మలుచుకుంటే ఖచ్చితంగా ప్రతి నెల కూడా రూ.2 నుంచి రూ.5 లక్షల వరకు సంపాదించుకోవచ్చు. ఈ వ్యవసాయనికి మంచి డిమాండ్ ఉన్నది.


కుంకుమపువ్వు ప్రస్తుత పరిస్థితులలో చాలా ఖరీదైనదిగా ఉన్నది. ముఖ్యంగా దీనిని ఎర్ర బంగారం అని కూడా పిలుస్తూ ఉంటారు. భారత దేశంలో కిలో కుంకుమపువ్వు ధర.. 2 నుంచి 3 లక్షల వరకు ఉంటుంది. వీటితోపాటు టెన్ వాల్వ్ విత్తనాలను కూడా ఉపయోగిస్తారు.. వీటి ధర కూడా సుమారుగా 500 పై గా ఉంటుందట. అయితే కుంకుమపువ్వు విత్తనాలు విత్తడానికి ముందే పొలాన్ని బాగా దున్నాలి అంతేకాకుండా మట్టిని బాగా ఆరబెట్టిన తర్వాత ఆవు పేడ ఎరువుతో పాటుగా నత్రజని ,భాస్వరం , పొటాషియం దున్నడానికి ముందే వేయాలి.


దీంతో కుంకుమపువ్వు ఉత్పత్తి కూడా బాగా పెరుగుతుంది. కుంకుమపువ్వు కోయడానికి జులై నుంచి ఆగస్టు వరకు మంచి సమయం. కుంకుమపువ్వు పండడానికి ఎక్కువ సూర్యరశ్మి అవసరం ..చలి వర్షాకాలంలో కుంకుమపువ్వు అని అసలు సాగు చేయలేరు. కుంకుమ పువ్వు ఎక్కువగా బంక మట్టి ఇసుక నీళ్లలో బాగా పండుతుంది. అయితే ఎక్కువగా నీరు నిల్వ ఉండే భూములలో ఈ పంటను పండించలేరు. కుంకుమ పువ్వు చిన్న చిన్న బాక్సులలో ప్యాకింగ్ చేసి ఏదైనా మార్కెట్లో అమ్మతే మంచి ధరలు ఉంటాయి. కుంకుమపువ్వును కొన్ని కొన్ని స్వీట్లలో కూడా వాడుతూ ఉంటారు .దీనివల్ల ఆ స్వీట్లకే మంచి రుచి పెరుగుతుంది. అలాగే పలు రకాల ఔషధాలలో కూడా ఈ కుంకుమ పువ్వు ని ఉపయోగిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: