వినోద పరిశ్రమ కొత్త అడుగుకు OTT ద్వారా పునాదులేసింది.. దాంతో ప్రేక్షకులు మెల్లమెల్లగా OTT లకు అలవాటుపడిపోతున్నారు.. అలా అలవాటు పడిన వారి నోటినుంచి ఒకమాట వస్తుంది.. కంటెంట్ ఉన్న చిత్రాలు OTT ల్లో చాల వస్తున్నాయి.. ఇన్నాళ్లు ఏమో అనుకున్నాం కానీ ఈమూడు ఫైట్స్ , ఆరు పాటల పాతచింతకాయపచ్చడి సినిమాలు చూసి చూసి బోర్ కొట్టింది.. OTT ల్లో వచ్చే మంచి మంచి సినిమాలకు, కంటెంట్ ఉన్న సినిమాలకే తమ ప్రాధాన్యం అని అంటున్నారు.. దాంతో ఏది పడితే అది తీస్తే సినిమాలు చూడము అని జనాలు చెప్పకనే చెప్తున్నారు..