యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన జెంటిల్ మెన్ సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పనవసరం లేదు.. ఈ చిత్ర నిర్మాత జెంటిల్ మెన్ కి పార్ట్ 2 తీస్తానని చెప్పి అందరిలో ఆసక్తి రేకెత్తించాడు. అయితే ఈ సినిమాలో అర్జున్ ఉంటాడా లేక మరో హీరో ఏవరయినా ఉంటారా అనేది చూడాలి.. కొత్త దర్శకులను ఎంకరేజ్ చేసే ఈ నిర్మాత ఓ కొత్త దర్శకుడి తో సినిమా చేశారని అంటున్నారు.. దర్శకుడు శంకర్ కి ఇప్పుడు బాడ్ టైం నడుస్తుందని చెప్పాలి.. ఎన్నో ఆశలతో మొదలుపెట్టిన భారతీయుడు సినిమా సీక్వెల్ సరిగ్గా జరగడం లేదు.. దాంతో తనకు పార్ట్ 2 లు, రీమేక్ లు అచ్చి రావడం లేదని అయన సన్నిథితులతో చర్చిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా కి దర్శకుడిగా ఎవరుంటారన్న ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది..