గతంలో షూటింగ్ మధ్యలో ఆగిపోయిన మెగాస్టార్ చిరంజీవి నటించిన `అబు బాగ్దాద్ గజదొంగ` ని కూడా త్వరలోనే రిలీజ్ చేస్తారా అనే టాపిక్ వైరల్ గా మారింది. సురేష్ కృష్ణ దర్శకత్వంలో 90వ దశకంలో ఈ చిత్రాన్ని ప్లాన్ చేశారు. ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఇండియన్ టెక్నీషియన్స్ తో పాటు హాలీవుడ్ టెక్నీషియన్స్ కలిసి వర్క్ చేసి తొలి భారతీయ చిత్రమిది. ఈ విషయం సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.