అల్లు అరవింద్ వారసుడు అయిన స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా రంగంలోకి దిగి ఆహా బ్రాండ్ కు మరింత క్రేజ్ పెంచే పనిలో పడ్డారట. అందులోనూ బన్నీ నే స్వయంగా నిర్మాతగా మారి కొన్ని వెబ్ సిరీస్ లను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికిగాను సొంతంగా ఓ బ్యానర్ నే లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే వీటికి సంబంధించిన కార్యక్రమాలు మొదలుపెట్టడానికి సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.