బాహుబలి వంటి ఘన విజయం తర్వాత దూకుడు పెంచారు దగ్గుబాటి రానా. తను చేస్తున్న ప్రతి ప్రాజెక్టును అన్ని రకాలుగా ఆలోచించి మరీ ఓకే చేస్తున్నారు. అయితే ప్రస్తుతం రానా తదుపరి ప్రాజెక్టు గురించి తాజా న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. గృహం చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించి ఘన విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడితో తదుపరి ప్రాజెక్టు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.