కరోనా కారణంగా దాదాపు ఎనిమిది నెలలు మూతపడ్డ సినిమా థియేటర్ల గేట్లు తెరుచుకున్నాయి. ఇటీవలే షూటింగ్ కు పర్మిషన్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు థియేటర్ సైతం అనుమతినిచ్చింది. కాకపోతే కరోనా వ్యాప్తి కొనసాగుతున్న కారణంగా.. 50 శాతం ప్రేక్షకులకు మాత్రమే అనుమతిస్తూ... కరోనా నిబంధనలను తప్పక పాటించాలని నియమాలతో థియేటర్లకు పర్మిషన్ ఇచ్చింది కేంద్రం.