మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం క్రాక్ అనే సినిమా ను చేస్తున్నవిషయం తెలిసిందే.. సంక్రాంతి కానుకగా జనవరి 15 న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. శృతిహాసన్ కథానాయిక గా నటిస్తున్న ఈ సినిమా కి గోపీచంద్ మలినేని దర్శకుడు. లాక్ డౌన్ తర్వాత షూటింగ్ ప్రారంభించుకుని పూర్తిచేసుకున్న ఈ సినిమా OTT లో రిలీజ్ కావాల్సి ఉండగా నిర్మాతలు ధియేటర్ రిలీజ్ కే ఎక్కువ మొగ్గు చూపారు. అందుకే థియేటర్లు ఓపెన్ అయ్యేవరకు వేచి చూసి మరీ టైం చూసుకుని సినిమా ని రిలీజ్ చేస్తున్నారు.