మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం క్రాక్ అనే సినిమా ను చేస్తున్న సంగతి తెలిసిందే..శృతిహాసన్ కథానాయిక గా నటిస్తున్న ఈ సినిమా కి గోపీచంద్ మలినేని దర్శకుడు. అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ని సంక్రాంతికి రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు. లాక్ డౌన్ తర్వాత షూటింగ్ ప్రారంభించుకుని పూర్తిచేసుకున్న ఈ సినిమా కి ముందు రవితేజ సినిమాలు దాదాపు ఆరు ఫ్లాప్ అయ్యాయి.. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలని తనకు అచ్చిచ్చిన డైరెక్టర్ తో చేతులు కలిపాడు..