పవన్ కళ్యాణ్ చేసిన తీన్మార్ సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది.. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మరీ గుర్తుంచేకునేంత హిట్ అయితే అవలేదు కానీ మోస్తరుగా ఆడింది. 2011 లో వచ్చిన ఈ సినిమాలో పాటలు ఎంతగానో ఆకట్టుకోగా జయంత్ సి.పరాన్జీ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ లో తెరకెక్కిన లవ్ ఆజ్ కల్ సినిమా కి రీమేక్ కాగా త్రివిక్రమ్ మాటలనందించడం విశేషం.. దర్శకుడిగా బిజీ గా ఉన్నా సమయంలో పవన్ కోసం త్రివిక్రమ్ ఈ సినిమా చేయగా త్రివిక్రమ్ కు ఈ సినిమా ద్వారా పెద్దగా ఒరిగింది అయితే ఏమీ లేదు.