శర్వానంద్ హీరోగా వచ్చిన శ్రీకారం సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది. వ్యవసాయం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా కి మంచి టాక్ వచ్చింది.. కొత్త దర్శకుడు కిషోర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా లో రావు రమేష్ కీలక పాత్ర లో నటించగా ఈ సినిమా ప్రమోషన్స్ టైం లో శర్వానంద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.. ‘‘భవిష్యత్తులో సినిమా అవకాశాలు తగ్గిపోతే.. నాకిక్కడ కెరీర్ లేదనిపిస్తే.. నేను వ్యవసాయమే చేస్తాను. కరోనా వల్ల దొరికిన విరామంలో నాకు వ్యవసాయం మీద ఆసక్తి పెరిగింది. మూడు నెలల పాటు ఫాం హౌస్‌లోనే గడిపా. కొత్త కొత్త వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసుకున్నా. ఆర్గానిక్ ఫార్మింగ్, టెర్రస్ ఫార్మింగ్ లాంటివి బాగా పాపులర్ అవుతున్నాయి.