సినీ ఇండస్ట్రీలో కొంతమంది చేసిన పాత్రలు కొన్నేళ్లపాటు గుర్తుండిపోతాయి. అలా అమృతం సీరియల్ లో నటించిన ప్రతి ఒక్కరు కూడా తమ అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ సీరియల్ యూట్యూబ్ లో అయితే అందుబాటులో ఉంది. ఈ సీరియల్లో టైటిల్ రోల్లో నటించిన హర్షవర్ధన్ ప్రతి ఒక్కరికి గుర్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆయన నటుడుగా డైరెక్టర్ గా రాణిస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హర్షవర్ధన్ తన సహనటుడు అయిన గుండుహనుమంతరావు గురించి పలు విషయాలను పంచుకొని ఎమోషనల్ గా మాట్లాడారు.


తాను అమృతం సీరియల్ కు బేసిక్ ఫ్యాన్ అని అందులో కూడా తాను నటించినప్పటికీ ఆడియన్స్ లాగే తాను కూడా అమృతం సీరియల్ ని చూసేవాడిని, ముఖ్యంగా గుండుహనుమంతరావుతో తనకున్న కాంబినేషన్ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన భౌతికంగా లేకపోయినా తన మనసులో మాత్రం ఎప్పటికీ ఉంటారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం వంటి దిగ్గజ నటుల మాదిరే గుండుహనుమంతరావు కూడా ప్రేక్షకుల మనసులో స్థిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు.


గుండుహనుమంతరావుతో తనకున్న సంబంధం గురించి మాట్లాడుతూ.. గుండుహనుమంతరావు ఎనర్జీ చూసి తాను ఎన్నో సార్లు ఆశ్చర్యపోయేవాడిని, తాను సహజంగానే సీరియస్గానే ఉంటాను నాన్ సింక్లో ఏదో ఆలోచిస్తూ ఉండేవాడిని కానీ, గుండు హనుమంతరావు వచ్చి తనని ఎక్కడ కూర్చొనిచ్చేవాడు కాదు. రారా, ఏంటి అలా ఉన్నావ్, మీరు ఇలా రండి, అది చేయండి ఇది చేయండి అంటూ ఎక్కువగా గోల చేసే వారిని గుర్తు చేసేవారు. సినిమా షూటింగ్లకు బైక్ పైన వెళ్తూ ఉంటే తనని కారు కొనమని ప్రోత్సహించేలా చేశారు. అలా దగ్గరుండి మారుతి 800 కొనేలా చేశారని తెలియజేశారు. ఏదైనా ఒక పెద్ద కల ,లక్ష్యం ఉంటే మనం మెరుగైన పని చేయవచ్చని అలాంటి మోటివేషన్ గుండుహనుమంతరావు దగ్గర నుంచే తనకు లభించిందని తెలిపారు. గుండుహనుమంతరావు నా జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించారని, ఇప్పటికీ ఆయన జీవించి ఉంటే తన జీవితం మరోలాగా ఉండేదేమో అంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: