తారక్ కేవలం సినిమాలతోనే కాక అప్పుడప్పుడు రియాలిటీ షోల ద్వారా కూడా ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటాడు. ప్రస్తుతం టెలివిజన్ రంగంలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షోగా వెలుగొందుతున్న " బిగ్ బాస్ ".. ఎన్టీఆర్ హోస్ట్ గానే ప్రారంభం అయ్యింది. ఇక బిగ్ బాస్ మొదటి సీజన్ కు బుల్లి తెరపై తారక్ చేసిన రచ్చ ఎలాంటిదో ప్రేక్షకులు అంత తేలికగా మర్చిపోలేరు. తన వాక్చాతుర్యంతో బిగ్ బాస్ షోను గ్రాండ్ గా సక్సస్ చెయ్యడమే కాకుండా ప్రేక్షకులను టివి లకు కట్టిపడేశాడు. మళ్ళీ ఇంకోసారి ప్రేక్షకులను బుల్లి తెరపై అలరించేందుకు సిద్దమయ్యాడు. జెమిని టీవి లో త్వరలో ప్రసారం అయ్యే "మీలో ఎవరు కోటీశ్వరులు " అనే రియాలిటీ షో ద్వారా పలకరించనున్నాడు.