దగ్గుబాటి రానా ఎప్పుడూ విభిన్న కథలను ఎంచుకుంటూ డిఫరెంట్ రోల్స్ లో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తనను తాను ఎప్పుడూ డిఫరెంట్గా చూసుకోవాలనే ఈ హీరో చేసే సినిమాలు కూడా రానాకు అంతే గుర్తింపు తెచ్చి పెడుతున్నాయి. ప్రస్తుతం రానా ప్రధాన పాత్రలో నటించి విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం అరణ్య . ప్రభు సోల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హిందీలో ‘హాథీ మేరే సాథీ’గా, తమిళంలో ‘కాండన్’గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.