ప్రస్తుతం పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న చిత్రం "ఆది పురుష్". బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ మహా భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో స్పెషల్ గా చేయించిన సెట్ లో నిర్విరామంగా కొనసాగుతోంది. ఏప్రిల్ మొదటి వారం వరకు జరగనున్న ఈ షెడ్యూల్ లో ఓ సాంగ్ తో పాటుగా కొన్ని యాక్షన్ సీన్స్ కూడా పూర్తి చేయనున్నారని సమాచారం.