ప్రస్తుతం వరుణ్ తేజ్ కుర్ర హీరోలు అందరికన్నా మంచి జోష్ లో ఉన్నాడు. మంచి కథలనే ఎంచుకుంటూ తన సినీ కెరీర్ ను పరుగులు పెట్టిస్తున్నాడు. సినీ జీవితం సాఫీగానే సాగుతున్నా ఒక వైపు ఫ్యాన్స్ లోనూ మరియు మెగా కుటుంబ సభ్యులలోనూ ఒక వెలితి కనిపిస్తోంది. అదేమిటంటే వరుణ్ తేజ్ పెళ్లి. ఇటీవలే నాగబాబు తనయ నిహారిక వివాహం జరగడంతో ఇక తరువాత లైన్ లో వరుణ్ తేజ్ ఉన్నాడు.