తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది సంగీత దర్శకులు వేల సినిమాలకు తమ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. అయితే కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసును గెలుచుకొని వారి మదిలో నిలిచి పోతుంటారు. అలాంటి వారిలో ఒకరు ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్. 'చిత్రం' .. ' నువ్వు నేను' .. 'సంతోషం' .. 'జయం' మనసంతా నువ్వు, నీ స్నేహం.. వంటి సినిమాలకు సంగీతాన్ని అందించి తన సత్తా నిరూపించుకున్నాడు.