టాలీవుడ్ లో అతి తక్కువ వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన నటీమణుల్లో హీరోయిన్ ఛార్మి ఒకరు. ఛార్మి తన సినీ జీవితాన్ని 2002లో `నీతోడు కావాలి` అనే చిత్రంతో ప్రారంభించింది. ఆ తరువాత వివిధ రకాల పాత్రలలో మెప్పించింది. నటిగా చేయడం బోర్ కొట్టింది అనుకుందో ఏమో కానీ నిర్మాతగా కొత్త అవతారం ఎత్తింది. జ్యోతిలక్ష్మి సినిమాతో ఛార్మి నిర్మాతగా పరిచయం అయింది.