ఒకప్పుడు ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ ఇండస్ట్రీ చుట్టూ తిరిగిన నవీన్ పోలిశెట్టి ఇప్పుడు క్రేజీ ఆఫర్లతో దూసుకుపోతున్నాడు. "ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ" చిత్రంతో తన టాలెంట్ ను కనబరిచి ఆడియన్స్ ను మెప్పించాడు. ఆ తరువాత జాతి రత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులను మైమరపించి యువతను తనవైపు తిప్పుకున్నాడు హీరో నవీన్ పోలిశెట్టి.