పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ షూటింగ్ స్పాట్ ఫోటోలు ఈ మధ్య కాలంలో వెబ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. సామాన్యంగా పవన్ తన సినిమా షూటింగ్ లకు సంబంధించిన ఫోటోలు బయటకు రాకుండా చాల జాగ్రత్తలు తీసుకుంటు ఉంటాడు. అయినా ఏదోవిధంగా ఆ వర్కింగ్ స్పాట్ స్టిల్స్ బయటకు లీక్ అవుతూ పవన్ అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. అయితే పవన్ అభిమానులు కూడ ఊహించని ఒక అరుదైన సంఘటన ఈమధ్య ‘సర్దార్ గబ్బర్ సింగ్’ షూటింగ్ స్పాట్ లో జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఈ షూటింగ్ యూనిట్ నుండి బయటకు వస్తున్న వార్తల ప్రకారం పవన్ పెద్ద కుమార్తె ఆధ్యా చిన్న కూతురు పొలేన ఈమధ్య ఒకరోజు అంతా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ షూటింగ్ లో తమ తండ్రి పవన్ కళ్యాణ్ తో కలిసి వచ్చి హడావిడి చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆరోజు షూటింగ్ స్పాట్ లో ఉన్న యూనిట్ సభ్యులు అంతా ఈ అనుకోని అతిధులను చూసి షాక్ అయ్యారట.
ఇక పవన్ పెద్ద కూతురు ఆధ్య అయితే పవన్ నటిస్తున్నప్పుడు తన తండ్రి పక్కనే ఉంటూ కెమెరా దగ్గర నుంచి. అన్ని విషయాలు చాల నిశితంగా పరిశీలించిందని టాక్. దీనితో అక్కడ యూనిట్ సభ్యులంతా పవన్ కూతురు ఆధ్యా కాబోయే డైరెక్టర్ అంటూ సెటైర్లు వేసారని టాక్. ఇక చిన్న కూతురు పోలేన తన క్యూట్ లుక్స్ తో అందర్నీ అలరించిందని టాక్.
అయితే వీరిద్దరి హంగామాకు సంబంధించి ‘సర్దార్’ యూనిట్ సభ్యులు తమ సెల్ ఫోన్స్ తో ఫోటోలు తీయడానికి ప్రయత్నించినా పవన్ సున్నితంగా ఆ ప్రయత్నాన్ని తిరస్కరించినట్లు టాక్. అయితే ఆ ఫోటోలు బయటకు రాకపోయినా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సెట్స్ పై పవన్ కుమార్తెల హంగామా న్యూస్ మాత్రం బయటకు లీక్ అయి వెబ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది..