నాగార్జున నిర్వహిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోలో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సంబంధించిన షూటింగ్ ఈమధ్యనే పూర్తి అయింది. ఈ కార్యక్రమ ప్రోమోను ‘మాటీవీ’ లో ఎక్కువ సార్లు చూపెడుతూ నాగార్జున ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమానికి మరింత ఎక్కువ రేటింగ్స్ రాబట్టడానికి భారీ కసరత్తు చేస్తున్నారు.
ఈ కార్యాక్రమంలో నాగార్జున వేసిన అనేక ఆ శక్తికర ప్రశ్నలకు జూనియర్ మంచి జోష్ తో సమాధానాలు ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. మధ్యలో నాగ్ జూనియర్ ను గడ్డం ఎందుకు తీసివేసావు ? అని ప్రశ్నించినప్పుడు పెరిగి పోయిన గడ్డం వల్ల తన కొడుకు తనను గుర్తు పట్టడం లేదని అందుకోసమే తన గడ్డం తీసివేసానని జోక్ చేసాడు జూనియర్.
ఇది ఇలా ఉండగా ఈ షోలో జూనియర్ 12,50,000 మొత్తాన్ని గెలుచుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఫిలింనగర్ లో వినపడుతున్న సమాచారం ప్రకారం ఈ మొత్తo లో తన బాబాయి బాలకృష్ణ చైర్మన్ గా కొనసాగుతున్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి, మరో సగం ఎన్టీఆర్ ట్రస్టుకు విరాళంగా ఈ షోలోనే జూనియర్ ప్రకటించినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా జూనియర్ చిలిపి పనులకు సంబంధించిన అనేక విషయాలను నాగ్ ఈ షోలో గుచ్చిగుచ్చి అడిగినట్లు టాక్. అయితే ఈషో ఈ వీకెండ్ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగాంలో ప్రసారం చేస్తారా లేదంటే సంక్రాంతి పండగ స్పెషల్ గా వచ్చే వారం వీకెండ్ లో ప్రసారం చేస్తారా అన్న విషయం పై ప్రస్తుతానికి సస్పెన్స్. ఒకవైపు తన బాబాయి బాలకృష్ణతో వార్ కు రెడీ అవుతూ మరోవైపు తన బాబాయి నిర్వహిస్తున్న ట్రస్టుకు విరాళం ఇవ్వడం ద్వారా జూనియర్ చాల వ్యూహాత్మక ఎత్తుగడ వేసాడనే అనుకోవాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి