విలక్షణ నటుడు జయప్రకాష్ రెడ్డి ఇటీవల తన సెంటిమెంట్ గురించి చెప్పుకొచ్చారు. తాను ఏదైనా సినిమాకు ఒక్కరోజు పనిచేస్తే ఆ సినిమా తప్పకుండా విజయ సాధిస్తుందట. ఈ విషయాన్ని ఈ మధ్య జయప్రకాష్ రెడ్డి స్వయంగా వివరించారు. నేను గబ్బర్ సింగ్ లో ఒక రోజు నటించాను. ఆ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలుసు. ఇప్పుడు దేవరాయ లోనూ ఒక్క రోజే నటించాను. మూడు సీన్లలో కనిపిస్తాను. ఈ సినిమా కూడా చాలా పెద్ద విజయాన్ని సాధిస్తుంది అని అన్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: